Crime: భార్యాభర్తలు అన్నాక చిన్నచిన్న గొడవలు సహజమే. కోపతాపాలు లేని కుటుంబాలు ఉండవు. కానీ ఆ కోపం చంపేంతగా ఉండకూడదు. దంపతుల మధ్య ఉండాల్సింది ప్రేమ తప్ప కక్షలు, పగలు ఉండకూడదు. క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని, కుటుంబాలను కాలరాస్తున్నారు. చిన్న విషయాలకే ప్రాణాలు బలితీసుకునేంతలా తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో జరిగింది.
నడిరోడ్డుపై భార్యను గన్ తో కాల్చిన భర్త
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా, జాలి దయ లేకుండానే నడిరోడ్డుపై తన భార్యను గన్ తో కాల్చి చంపాడు. విడాకుల విషయంలో గొడవ జరిగి.. అది కాస్త హత్యకు దారితీసింది. తన తండ్రికి ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని కూతురు చెప్పింది. విశ్వకర్మ చౌహాన్, మమతా చౌహాన్ (32)కు గత 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఈ దంపతులకు 13 ఏళ్ల కూతురు కూడా ఉంది. మమత ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుంది. అయితే వీరిద్దరి మధ్య గత రెండేళ్లుగా విడాకుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మమతా చౌహాన్ తన కూతురితో కలిసి వేరుగా ఉంటుంది. ఈ పరిస్థితిలో భర్త విశ్వకర్మ చౌహాన్ విడాకులు కావాలని భార్యను పలుమార్లు కోరాడు. దీంతో ఆమె కొన్ని షరతులను విధించింది.
ఆస్తిలో వాటతోనే హత్య
మమతా చౌహాన్ కూతురి సంరక్షణ కోసం వ్యవసాయ భూమిని ఇవ్వాలని కోరింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న విశ్వకర్మ(Viswakarma) భార్యపై పిస్టల్ తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె సంఘటనాస్థలంలోనే మరణించింది. దీనికి సంబంధించిన ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యాయి. తన తండ్రికి ఉన్న వివాహేతర సంబంధాల వల్ల తల్లి నిహించించేవాడని, చివరికి హతమార్చాడని చెప్పింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి, అతనివద్ద ఉన్న పిస్టోలును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఈ ఘటన స్థానిక పోలీస్ పరిధిలో జరిగింది, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
హత్యకు కారణం ఏమిటి?
విడాకుల సమస్యలతో కలహాలు పెరగడం వల్ల భర్త భార్యను కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: