हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Telangana crime: పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య

Tejaswini Y
Telangana crime: పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య

Telangana crime: తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా బచ్చన్నపేట(Bachannapet) మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Read Also: Mahabubnagar: మైనర్ల ప్రేమ గర్భం దాల్చిన బాలిక

మృతులను రామ్‌రెడ్డి మరియు లక్ష్మిగా గుర్తించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఈ దంపతులు గత కొంతకాలంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైద్య చికిత్సలు చేయించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యారని తెలిపారు.

Husband and wife suicide
Telangana crime: Husband and wife commit suicide after consuming pesticide

ఆరోగ్య సమస్యల(Health Issues)తో పాటు ఆర్థిక భారం కూడా పెరగడంతో జీవితంపై నిరాశ చెందారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగినట్టు సమాచారం. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ విషాద ఘటనతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది. అనారోగ్యం, మానసిక ఒత్తిడితో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా బాధితులు ప్రభుత్వ ఆస్పత్రులు, కౌన్సెలింగ్ కేంద్రాల సహాయాన్ని తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870