
తమిళనాడు (Tamilnadu) లోని క్రిష్ణగిరి జిల్లాలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక మహిళల హాస్టల్‌లో టాయిలెట్‌లో స్పై కెమెరాలు అమర్చిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన మంగళవారం రాత్రి బయటపడగా, అక్కడి మహిళా ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: TG Crime: కూతురి కిడ్నాప్ కు యత్నించిన తల్లిందండ్రులు.. కేసు నమోదు
ఓ మహిళే ఈ పని చేయడం గమనార్హం. ఇక వివరాల్లోకి వెళ్తే.. టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ తమ ఉద్యోగుల కోసం హాస్టల్‌ను నిర్వహిస్తోంది. ఒడిశాకు చెందిన ఓ మహిళా ఉద్యోగి కూడా అక్కడే ఉంటోంది. ఈమెనే టాయిలెట్‌లో స్పై కెమెరాను అమర్చింది.దీని ద్వార రహస్యంగా వీడియోలు షూట్ చేస్తోంది.
అయితే ఆ హాస్టల్‌లో ఉంటున్న మరో మహిళకు ఆమె చేష్టలపై అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఆమె హాస్టల్ నిర్వాహకులకు చెప్పింది. వాళ్లు తనిఖీలు చేయడంతో టాయిల్‌టో ఈ స్పై కెమెరాలు (Spy cameras) పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడ ఉంటున్న దాదాపు రెండు వేల మంది మహిళలు ఆందోళనకు దిగారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితురాని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: