తిరువనంతపురం (Thiruvananthapuram) నగరంలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. నిర్లక్ష్యం కారణంగా అమాయక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఆందోళనకు దారి తీసింది. కుటుంబసభ్యులు ఇంటి మరమ్మతుల కోసం ప్లంబింగ్ పనులు చేయించుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది.
Hyderabad Road Accident: ఎల్‌బీనగర్‌లో భయానక రోడ్డు ప్రమాదం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని పెరూకాడ ప్రాంతానికి చెందిన కుటుంబం ఇంట్లో ప్లంబింగ్ పనులు (Plumbing works) చేయించుకుంటోంది. ప్లంబర్లు పైపులు ఫిక్స్ చేసే క్రమంలో ఒక డ్రిల్లింగ్ మిషన్‌ను టేబుల్‌పై ఉంచారు. పనులు కొంతసేపు ఆగిన సమయంలో ఆ ఇంట్లో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ఆ డ్రిల్లింగ్ యంత్రాన్ని చూశాడు.

దాన్ని పట్టుకోవడానికి టేబుల్ మీదకు ఎక్కాడు.దాని కవర్ నుండి దానిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా డ్రిల్లింగ్ మిషన్ (Drilling machine) తో పాటు బాలుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బాలుడి చేయి బటన్‌కు టచ్ కావడంతో డ్రిల్లింగ్ మిషన్ ఆన్ అయి నేరుగా బాలుడి తలలోకి చొచ్చుకుపోయింది.
బాలుడిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు
మిషన్ ఆన్ అయిన శబ్ధం విన్న కార్మికులు, ఇంట్లోని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా హాల్‌లోకి వచ్చారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న బాలుడిని చూసి షాక్ అయ్యారు.తీవ్రగాయాలతో పడి ఉన్న బాలుడి (boy) ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు.
కానీ కాసేపటికే బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం తర్వాత బాలుడు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: