తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని తిరునల్వేలి (Tirunelveli) లో ఆదివారం రోజు జరిగిన ఓ హృదయ విదారక ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్పందనను కలిగించింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కవిన్ ను ఆసుపత్రిలో దుండగుడు నరికి చంపేశాడు. బాధితుడు చెన్నైకి చెందిన 27 ఏళ్ల కవిన్‌గా గుర్తించారు.

ప్రేమించాడన్న కక్షతో హత్య
ప్రాథమిక దర్యాప్తులో ఇది పరువు హత్యగా తేలింది. నిందితుడు సుర్జిత్ తన సోదరిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో కవిన్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన తమ్ముడు సోదరిని ప్రేమించడమే హత్యకు కారణమన్న కోణంలో పరిశీలనకు దారితీసింది.
పోలీస్ కుటుంబం.. అయినా ఉన్మాదానికి తగ్గలేదు
గమనించదగిన విషయం ఏమిటంటే.. నిందితుడు సుర్జిత్ తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. అయినా తమ కుమారుడి నేరానికి కుట్రపన్నారు. హత్య వెనుక అమ్మాయి సోదరుడితోపాటు, ఆమె తల్లిదండ్రుల హస్తం ఉందని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో, పై అధికారులు తక్షణమే స్పందించి నిందితుడి తల్లిదండ్రులను వీఆర్ (Vinayak Reserve)లో ఉంచారు.
కుల కోణం విచారణలో భాగం
ఈ పరువు హత్య వెనుక కుల వివక్ష కోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు కింది స్థాయి కులానికి చెందినవాడన్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చిన్ననాటి స్నేహం ప్రేమగా మారిన దురదృష్టం
కవిన్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సుర్జిత్ సోదరి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్‌గా పనిచేస్తోంది. కవిన్, ఆమె చిన్ననాటి స్నేహితులు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఆసుపత్రిలో కలుసుకునేందుకు ఆమె పిలవడంతో కవిన్ అక్కడికి వెళ్లగా, దాడి జరిగింది. హత్య తర్వాత సూర్జిత్ నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఈ కేసు ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana: భార్య పిల్లలను వదిలేసి ట్రాన్స్ జెండర్ తో సహజీవనం