అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం..
తమిళనాడు(Tamil Nadu crime)లోని తూత్తుకుడి జిల్లాలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అస్సాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మహిళపై ఆమె భర్త ఎదుటే సామూహిక అత్యాచారం (rape) జరిగింది. ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఆ దంపతులు తక్కువ వేతనం కారణంగా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా, ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డగించి అడవిలోకి బలవంతంగా తీసుకెళ్లారు.
Read Also: Hyderabad: కేపీహెచ్ బి పరిధిలో కలకలం.. ర్యాగింగ్ భరించలేక విద్యార్థి మృతి

ఇద్దరు మైనర్లు సహా ముగ్గురి అరెస్టు
ఈ క్రమంలో భర్తను తీవ్రంగా కొట్టి కట్టివేసి, అతడి కళ్లముందే మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు మైనర్లు సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, మానసిక సహాయం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను బలోపేతం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: