T20 : జూన్ 12 నుండి మహిళల వరల్డ్ కప్: 12 జట్లు, 33 మ్యాచులు.. ఫైనల్ లండన్లో
వూమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2025 జూన్ 12 నుండి ప్రారంభం కానుంది, ఈ టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. 33 మ్యాచులు జరుగనున్నాయి, వీటిలో ఫైనల్ మ్యాచ్ చారిత్రాత్మక లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జూలై 5న జరగనుంది. 2017లో కూడా మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లార్డ్స్‌లోనే జరిగింది, అందువల్ల ఈ స్థానానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈసారి వూమెన్స్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు ఇంగ్లాండ్‌లోని వివిధ ప్రముఖ స్థలాల్లో జరుగనున్నాయి, వాటిలో ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లీ, ఎడ్బాస్టన్, ఓవల్, హాంపీషైర్ బౌల్ మరియు బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ ఉన్నాయి. టోర్నమెంట్‌కు 12 జట్లు అర్హత సాధించాయి, వీటిని రెండు గ్రూపులుగా విభజించి, గ్రూప్ రౌండ్ మ్యాచ్‌లు నిర్వహించబడతాయి. గ్రూప్ దశ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి ఎనిమిది జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. మిగతా నాలుగు జట్ల కోసం క్వాలిఫైయర్ పోటీలు నిర్వహించబడతాయి. ఐసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ, బ్రిటన్‌లో అన్ని జట్లకు అభిమానుల నుంచి మద్దతు లభించబోతుందన్నారు.2020లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచునకు మెల్బోర్న్‌లో 86,174 మంది ప్రేక్షకులు హాజరయ్యారని, ఈ టోర్నమెంట్ కూడా ఇదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను పొందుతుందని చెప్పారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇంగ్లాండ్ మహిళల జట్టు కెప్టెన్‌గా నాట్ సివర్ బ్రంట్‌ను ఎంపిక చేసింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన నాట్ సివర్, ఇప్పుడు ఇంగ్లాండ్ మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.
Read More : IPL 2025: తన రిటైర్మెంట్‌పై ధోని ఏమన్నాడంటే..?