ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్, మనీ లాండరింగ్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (Enforcement Directorate) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో తాజాగా భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రైనా హాజరై, అధికారుల ముందు విచారణలో పాల్గొన్నారు.ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, ఈ వ్యాపారంలో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ప్రమోషన్ల ద్వారా భాగస్వామ్యం అయ్యారనే అనుమానాలపై ఈడీ సుదీర్ఘంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో సురేశ్ రైనా (Suresh Raina) పేరు కూడా వెలుగులోకి వచ్చింది. రైనా ఒక ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేంద్ర దర్యాప్తు సంస్థ అతని వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నది.1xBet అనే యాప్‌కు సంబంధించిన అక్రమ బెట్టింగ్ కేసులో బుధవారం విచారణకు హాజరు కావాలంటూ సురేశ్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు (summons) జారీ చేసిన విషయం తెలిసిందే.
పెట్టుబడిదారులను
అక్రమ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ ఆదేశాల మేరకు సురేశ్ రైనా ఇవాళ విచారణకు హాజరయ్యారు.అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ చాలా మంది వ్యక్తులతో పాటు పెట్టుబడిదారులను రూ.కోట్లల్లో మోసం చేయడంతో పాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. సురేశ్ రైనా టీమిండియా మాజీ ప్లేయర్. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 322 అంతర్జాతీయ మ్యాచులు ఆడి దాదాపు 8వేల పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్ రైనా. ఐపీఎల్‌లోనూ సీఎస్‌కే తరఫున ఆడాడు. ఐపీఎల్ రైనా కెరీర్ అద్భుతంగా ఉంది. 205 మ్యాచ్‌ల్లో 5,528 పరుగులు చేశాడు. నాలుగు సార్లు సీఎస్‌కేను చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.
సురేశ్ రైనా ఏ రాష్ట్రానికి చెందినవారు?
ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
రైనా క్రికెట్ కెరీర్‌లో ముఖ్యమైన ఘనత ఏమిటి?
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో శతకం చేసిన తొలి భారత క్రికెటర్.
Read hindi news: hindi.vaartha.com
Read also: