అభంశుభం తెలియని 17ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. దీంతో ఆ బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. అయితే గర్భాన్ని తొలగించడానికి హాస్పిటల్ కి వెళ్లి.. వైద్యుల సూచన మేరకు అబార్షన్ మాత్ర తీసుకున్న మరుసటి రోజు తీవ్ర రక్తస్రావంతో(bleeding) మరణించింది. ఈ దుర్ఘటన సర్వత్రా విషాదం నింపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

లైంగిక దాడితో గర్భం
మహారాష్ట్ర లోని యావత్మల్కు చెందిన విద్యార్థిని గతేడాది డిసెంబరు నుంచి 28ఏళ్ల ట్యూషన్ టీచర్ సందేశ్ గుండేకర్ వద్ద చదుకోవడానికి వెళ్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని గుండేకర్ విద్యార్థినిని మోసగించి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీని ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. విద్యార్థిని ఆరోగ్యం క్షీణించడంతో విషయం బయటపడింది. దాంతో భట్కూలి పోలీసులు ట్యూషన్ టీచర్ సందేశ్ గుండేకర్పై అత్యాచారం కేసు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సమాజానికి భయపడ్డ బాలిక తండ్రి కుమార్తెను పుసద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుడు అబార్షన్ మాత్రను(abortion pill) ఇచ్చాడు. కానీ మాత్ర తీసుకున్న కొద్ది గంటల్లోనే విద్యార్థినికి తీవ్రరక్తస్రావం అయ్యింది. పరిస్థితి విషమించి ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో నాందేడ్లోని ఒక పెద్ద ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు
బాలికకు అల్ట్రాసౌండ్ లేదా ఇతర పరీక్షలు చేయకుండానే అబార్షన్ మాత్ర ఇవ్వడంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంపిటి) చట్టం ప్రకారం గర్భం ఎక్కువ దశలో ఉంటే అబార్షన్ కోసం ప్రత్యేక పద్ధతులు, వైద్య మద్దతు అవసరం. కానీ ఈ కేసులో వైద్యులు అలా చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. సదరు ట్యూషన్ టీచర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినా బాలిక తన కుటుంబసభ్యులకు చెప్పకపోవడంతో విషాదంతో బాలిక మరణించింది. పిల్లలు తమకు ఏ కష్టం వచ్చినా వెంటనే తల్లిదండ్రులకు, పెద్దలకు చెప్పాలి. వారి సాయంతో సమస్యను పరిష్కరించుకోవాలి. లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి.
బాలికపై జరిగిన దారుణం ఏమిటి?
బాలికపై అత్యాచారం జరిగి, ఆ తరువాత ఆమెకు గర్భస్రావం చేయించడం వల్ల చికిత్స సమయంలో పరిస్థితి విషమించి మృతి చెందింది.
పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: