- తదనంతరం గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం
సిద్దిపేట ప్రభాత వార్త ప్రతినిధి :
కుటుంబ కలహాలతో భర్త భార్య గొంతు కోసిన ఘటన సిద్దిపేట(Siddipet) జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని ఆదర్శ నగర్ లో ఎల్లయ్య, భార్య శ్రీలత, కూతురు అర్చనతో కలిసి నివాసం ఉంటున్నారు. ఏమైందో తెలియదు కాని ఉదయం ఎల్లయ్య భార్య శ్రీలత (40) గొంతు కోశాడు. అడ్డు వచ్చిన కూతురు అర్చన ను రోకలి (Siddipet)బండతో కొట్టాడు. తదనంతరం భార్త ఎల్లయ్య భయంతో గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: