హైదరాబాద్‌లో మరోసారి పగలప్పుడే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుస్తున్న ఓ మహిళను టార్గెట్ చేసిన ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని పరారయ్యారు. ఆ సమయంలో అక్కడ దుకాణాలు, రాకపోకలు ఉన్నా కూడా దొంగలు ఎలాంటి భయం లేకుండా ఈ పని చేశారు. ఈ దృశ్యం ఎదురు షాప్‌లో ఉన్న సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
Read also: Guntur : ప్రాణం పోతున్న దయతలచని వాహనదారులు
జమున అనే మహిళ
బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కారం జమున అనే మహిళ తూంకుంటలోని ఒక పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఇటీవల ఆరోగ్యం బాగాలేక కొంతకాలం స్కూల్‌కు వెళ్లలేకపోయింది. మళ్లీ విధుల్లో చేరేందుకు ఆసుపత్రి నుండి మెడికల్ సర్టిఫికెట్ తీసుకొని స్కూల్‌కు బయల్దేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. దుండగులు ముఖంపై రుమాలు కట్టుకోవడంతో గుర్తుపట్టే అవకాశం లేకపోయినా, బైక్ నెంబర్ ఆధారంగా వారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: