
హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ(SBI ATM) ప్రధాన కార్యాలయానికి చెందిన ఏటీఎం వద్ద దుండగులు కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రషీద్ అనే వ్యక్తిని వెంబడించిన దుండగులు గన్‌తో కాల్చి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు.
Read Also: Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!
కాలికి బులెట్ గాయం – ఆస్పత్రిలో చికిత్స
ఈ ఘటనలో రషీద్‌కు కాలికి తూటా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు
ఈ దోపిడీ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్(SBI ATM) తాజాగా బయటకు వచ్చింది. దృశ్యాల ఆధారంగా దుండగుల కదలికలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: