తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బొంబాయి కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి (26) స్కూటీపై వెళ్తుండగా, ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం బీహెచ్ఈఎల్ బస్ డిపో సమీపంలో చోటుచేసుకోగా, ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read also: Nagpur: రెండు నెలలుగా బాలుడిని గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు..
జిమ్ ట్రైనర్‌గా గుర్తింపు.. కేసు నమోదు చేసిన పోలీసులు
మృతురాలు ఉమా మహేశ్వరి బీరంగూడ ప్రాంతంలో జిమ్ ట్రైనర్‌గా పని చేస్తూ మంచి గుర్తింపు పొందింది. యువ వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? ఇతర కారణాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన రోడ్డు భద్రతపై మరింత అప్రమత్తత అవసరమని మరోసారి తెలియజేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: