వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి NH–163 పై ఆగిఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.. ప్రమాదం ధాటికి బస్సు ఎడమవైపు పూర్తిగా ధ్వంసమైంది.ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Read Also: UP Crime: యూపీలో దారుణం ఒకే ఇంట్లో ఐదు మంది మృతదేహాలు

రాజధాని బస్సు వెనుకనుండి డీ కొట్టింది
ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది.. TG07UK5469 నెంబర్ గల ఇసుక లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా జాతీయ రహదారిపై నిలిపాడు. ఈ మార్గంలో హనుమకొండ నుండి హైద్రాబాద్ వెళ్తున్న TG03Z0046 నెంబర్ గల సూపర్ లెగ్జరీ రాజధాని బస్సు వెనుకనుండి డీ కొట్టింది.బస్సులో ఎడమ వైపు కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు..
మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి..మృతులు దిండిగల్ కు చేసిన పులమాటి ఓం ప్రకాష్( 75 ) గా గుర్తించారు.. మరొకరు హనుమకొండలోని బాలసముద్రం ప్రాంతానికి చెందిన నవదీప్ సింగ్ గా గుర్తించారు.. ఆరుగురు క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: