
రాజస్థాన్‌లోని(Rajasthan) కోటా నగరంలో చోటుచేసుకున్న ఓ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ అనే వ్యక్తి రాత్రి సమయంలో ఓ ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో గోడలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ రంధ్రం చిన్నదిగా ఉండటంతో మధ్యలోనే ఇరుక్కొని బయటకు రాలేకపోయాడు.

Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు
కొంతసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గోడలో చిక్కుకున్న అతడిని చూసి భయాందోళనకు(Rajasthan) గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో అతడిని బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిపై చోరీ యత్నం కేసు నమోదు చేశారు. విచారణలో మరో ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు పవన్ ఓ పోలీసు అధికారి వద్ద డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థకు చెందిన వ్యక్తే ఇలా నేరానికి పాల్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: