ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా పెళ్లాడాలని అనుకున్నాడు. ఏవిధంగానైనా ప్రియురాలి తల్లిదండ్రుల మనసును దోచేసి, ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు. వారిచేత మెప్పుపొంది, తమ కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేస్తారని భావించాడు. అందుకోసం ఓ మాస్టర్ స్కెచ్ వేశాడు. అనుకున్నట్లుగానే దాన్ని అమలు చేశాడు. చివరికి ప్లాన్ అట్టర్ ప్లాప్ అయి, కటకటాలు లెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఓ యువకుడు ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి ప్రాణాలనే ఫణంగా పెట్టాడు.
Read also: Khammam Road Accident: లారీ ఢీ కొట్టి దంపతులు దుర్మరణం

He impressed his parents by having his girlfriend hit by a car
ఎవరూ ఊహించని స్థాయిలో ఓ విడ్డూరమైన నాటకానికి తెరలేపాడు. ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులు ఇతడిని హీరోలా భావించి, తమ కుమార్తెను ఇతడికే ఇచ్చి పెళ్లి చేస్తారని భావించాడు. ఇంకేం ఉంది. అనుకున్నట్లుగానే ప్రియురాలిని కారుతో గుద్దించాడు. ఆపై తానే ఆమెను కాపాడినట్లుగా ఆసుపత్రికి తీసుకెళ్లి, అన్ని సపర్యలూ చేసి, అత్తామామల ముందు హీరో అనిపించుకోవాలని తపించాడు. కానీ ఇదేమీ తెలియని అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కోసం నాటకం
సీన్ కట్ చేస్తే ఈ ప్లాన్ అమలు చేయడానికి రంజిత్ తన స్నేహితుడైన ఎజెస్ సహాయం తీసుకున్నాడు. గత ఏడాది డిసెంబరు 22వ తేదీన తన పథకాన్ని అమలులో పెట్టాడు. రంజిత్ ప్రియురాలు కోచింగ్ సెంటర్ నుంచి తన స్కూటీపై ఇంటికి వెళ్తుండగా వాఝముట్టం ఈస్ట్ ప్రాంతంలో మాటు వేసిన ఎజెస్ తన కారుతో ఆమెను ఢీకొట్టాడు. అనంతరం కారు ఆపకుండా వేగంగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో ఆ యువతి మోచేయి, చేతి వేళ్లు విరిగిపోయాయి. వెంటనే రంజిత్ మరో కారులో అక్కడికి చేరుకుని.. ఏమీ తెలియనట్లుగా నటించి ఆమెను ఆసుపత్రికి తరలించాడు.
అనుకున్నట్లుగానే తమ కుమార్తె ప్రాణాలు కాపాడినందుకు ఆమె తల్లిదండ్రులు రంజిత్ ను మెచ్చుకున్నారు. అతడిని ప్రశంసించారు. అయితే పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తమదైన విధానంలో విచారించగా అసలు విషయం చెప్పారు. దీంతో ఇద్దరిపై హత్యాయత్నం Murder కింద కేసు నమోదు చేసి, జైలుకు పంపారు. పాపం ప్రేయసిని పెళ్లాడేందుకు పెళ్లి పీటలమీదికి ఎక్కాల్సిన ప్రియుడు ఇలా జైలు పాలు అయ్యాడు. ప్రేమించడం తప్పుకాదు, పెళ్లాడం కూడా తప్పు కాదు, కానీ దాని కోసం మనుషుల ప్రాణాలతోనే చెలగాటమాడేందుకు ప్రయత్నించే ప్రతిబుద్ధులందరికీ ఈ సంఘటన ఓ గుణపాఠం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: