ఇటీవల కానిస్టేబుల్ ప్రమోద్ ను(Pramod Case) హతమార్చిన కేసులో పోలీసుల కాల్పులో మరణించిన రియాజ్ పై అతని తల్లి సంచల వ్యాఖ్యలు చేసింది. నా కొడుకు మెడ విరిచేశారని, పొట్టలో నుండి పేగులు బయటకు వచ్చాయని ఆమె ఆరోపిస్తున్నారు. నిజంగా నా కొడుకు హంతకుడు అయితే అందుకు ఆధారాలను చూపించాలని, తనకు మనశ్శాంతిగా ఉంటుదని అన్నారు. తన కొడుకు చనిపోయినప్పుడు, అంతిమయాత్రలో తీసుకెళ్తుంటే కొందరు పటాకులు కాల్చి, సంబరాలు చేసుకున్నారని ఆమె వాపోయింది. శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేస్తుంటే, ఇక్కడ చేయకూడదు అని వెళ్లగొట్టారని, ఇలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదని రియాజ్ తల్లి కంటతడి పెట్టింది. చట్టం తమ చేతిలో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: AP Crime: ప్రియురాలి వేధింపులకు బలైన ప్రియుడు

రియాజ్ మృతిపై సామాజిక వేత్త సంచలన వ్యాఖ్యలు
రియాజ్ ఒక పోలీస్ అధికారిని నిజంగా చంపితే అతను నిజామాబాద్(Nizamabad) లో(Pramod Case) ఉంటాడా.. వాళ్ల కుటుంబాన్నీ తీసుకొని పారిపోడా? పోలీసులు తన కుటుంబాన్ని హింసిస్తున్నారని రియాజ్ తానే స్వయంగా లొంగిపోయాడు అని సామాజికవేత్త పోలీసులపై పలు ఆరోపణలు చేశారు. లొంగిపోయిన తర్వాత పోలీసులు అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్రహింసలు పెట్టారని, అతను కస్టడీలోనే చనిపోయినట్లుగా ఆయన ఆరోపించారు. రియాజ్ మెడ విరిగిపోయింది, శరీరంపై పలు గాయాలు ఉన్నాయని, ఇలాంటి రియాజ్ పోలీసులను ఎదిరించి గన్ లాక్కుంటాడా. అని ఆయన ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: