NRI woman murdered USA : అమెరికాలోని కొలంబియా నగరంలో 27 ఏళ్ల NRI యువతి నికిత గొడిశాల అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతదేహం తన మాజీ ప్రియుడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటన NRI వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.
పోలీసుల కథనం ప్రకారం, నూతన సంవత్సర వేడుకల తర్వాత నుంచి నికిత కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ జనవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను చివరిసారిగా నికితను డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలోని తన అపార్ట్‌మెంట్‌లో చూశానని అతడు తెలిపాడు. అయితే ఈ ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే అర్జున్ దేశం విడిచి భారత్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
Read also: AP: త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా: సీఎం చంద్రబాబు
జనవరి 2న అర్జున్ భారత్‌కు వెళ్లిపోయిన (NRI woman murdered USA) తర్వాత పోలీసులు అనుమానంతో అతడి అపార్ట్‌మెంట్‌కు సెర్చ్ వారెంట్ జారీ చేశారు. అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేయగా అక్కడ నికిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై గాయాల గుర్తులు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ప్రాథమిక విచారణలో డిసెంబర్ 31 రాత్రి ఆమెను అర్జున్ శర్మ హత్య చేసినట్లు స్పష్టమైంది.
అయితే హత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. భారత్‌కు పారిపోయిన అర్జున్‌ను పట్టుకునేందుకు అమెరికా పోలీసులు ఫెడరల్ అధికారుల సహాయాన్ని కోరారు. మరోవైపు నికిత స్నేహితులు ఆమె కోసం గాలించినా, చివరకు ఆమె హత్యకు గురైన వార్త తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: