ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) మరోసారి మహిళా భద్రతపై ప్రశ్నార్థక చిహ్నం వేసే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫరూఖాబాద్ (Farrukhabad) సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలవరపరిచింది. 33 ఏళ్ల నిషా సింగ్ అనే మహిళపై ఓ దుండగుడు కిరాతకంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు.
ఘటన ఎలా జరిగింది?
నిషా సింగ్ వివాహిత. ఆమెను కొంతకాలంగా దీపక్ అనే వ్యక్తి తరచూ వేధిస్తున్నాడు. తనతో మాట్లాడాలని, సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నాడట. నిషా తిరస్కరించడంతో అతడు మరింతగా హింసించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.(Uttar Pradesh) ఈ వేధింపులు తాళలేక ఆమె ఇటీవలే తన తండ్రి ఇంటికి వెళ్ళింది. ఒకరోజు అక్కడి నుంచి స్కూటీపై బయలుదేరిన నిషాను దీపక్ గమనించాడు. వెంటనే స్కూటీకి అడ్డంగా వచ్చి ఆపేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో దీపక్ తన స్నేహితులతో కలిసి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్న నిషా కేకలు వేస్తూనే స్కూటీ నడిపి సమీప ఆసుపత్రికి చేరుకోవడం చూసినవారు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆసుపత్రిలో చికిత్స ఫలించలేదు
మంటల్లో 80 శాతం కాలిన నిషాను తొలుత స్థానిక ఆసుపత్రిలో (Hospital) చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నోలోని మరో హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆమె గాయాలు తీవ్రంగా ఉండటంతో వైద్యులు కాపాడలేకపోయారు. ఈ ఘటన విన్న వారందరూ షాక్‌కు గురయ్యారు. దీపక్ కొంతకాలంగా మా చెల్లిని వేధిస్తున్నాడు. ఎప్పుడూ ఫోన్ చేసి, ఇంటి దగ్గర వేచి చూసి ఇబ్బందులు పెట్టేవాడు. నిషా ఈ విషయం చాలాసార్లు చెప్పింది. చివరికి ఇలాంటి కిరాతకం చేశాడు” అని బాధితురాలి సోదరి నీతూ సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. నిషా తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ “నా కూతురి ప్రాణాలు తీసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలి” అని డిమాండ్ చేశారు.
పోలీసులు రంగంలోకి
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిషా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు దీపక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: