నెల్లూరు క్రైమ్ : కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో తమ గంజాయి అమ్మకాలకు, అనైతిక కార్యక్రమాలకు(Nellore Crime) అడ్డు తగులుతున్నాడని అరవ కామాక్షి, మరికొందరు కలిసి పెంచలయ్యను హత్య(Murder) చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ సంఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను నెల్లూరు రూరల్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక ఆర్డిటి కాలనీలో నివాసం ఉండే కొట్టవీడి పెంచలయ్య (35) ప్రజానాట్య మండలిలో జిల్లా కమిటీ సభ్యుడుగా ఉంటూ, కాలనీలో ఆసాంఘిక కార్యక్రమాలపై ప్రజలను చైతన్య పరుస్తూ, చురుగ్గా ఉంటాడు. బోడిగాడి తోట నుండి ఆర్డిటి కాలనీకి వచ్చి స్థిరపడిన అరవ కామాక్షి కుటుంబం గంజాయి వ్యాపారం చేస్తూ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండేవారు. క్రమంలో పెంచలయ్య వారికి అడ్డు తగులు తుండడం, గంజాయి అమ్మకాలను నిరోధిం చేందుకు స్థానికులను చైతన్య పరుస్తుండడం కంటగింపుగా మారింది. మధ్యలో ఆగిపోయిన ముత్యాలమ్మ తల్లి గుడి పనులను కూడా ఆరవ కామాక్షి ప్రమేయం లేకుండా స్థానిక యువత ఈ సహకారంతో పూర్తి చేసుకోవటం జరుగుతోంది.
Read also: లౌకికవాదం, సామాజిక న్యాయాలను కాపాడుకోవాలి

పెంచలయ్య హత్య కేసులో కామాక్షి కీలక పాత్ర
కామాక్షి ఆధిపత్యం(Nellore Crime) పూర్తిగా తగ్గిపోవటంతో, ప్రతి పనిలో పెంచలయ్య అడ్డు తగులుతున్నాడని, పెంచలయ్య అనే వ్యక్తి కాలనీ వాసులు అందర్నీ మార్చేస్తున్నాడని భావించి, కామాక్షి తన సహచరులతో కలసి పక్కా ప్రణాళికతో తన తమ్ముళ్లు ఇతరుల సహకారంతో పెంచలయ్యను హత్య చేయించిందచింది. వారి పదకు ప్రకారం ఈ నెల 28వ తేదీ సాయంత్రం తన కుమారుడ్ని స్కూలు నుండి తీసుకువెళ్తున్న పెంచలయ్యను 10 మంది వ్యక్తులు వెంబడించి కల్లూరుపల్లి వద్ద మోటార్ సైకిల్ తో ఢీ కొట్టి కిందపడిన అతనిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. స్థానికులు గమనించి పెంచలయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లే లోగా ఆయన మరణించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రూరల్ సీఐ జి. వేణు కేసు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, రూరల్ డిఎస్పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిందితులు తలదాచుకున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి సిఐ అక్కడికి వెళ్లారు. నిందితుల్లో ఒకడైన జేమ్స్ హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ పై కత్తితో దాడి చేశాడు. దీంతో సీఐ వేణు రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో జేమ్సు స్వల్ప గాయమైంది.
పోలీసులపై దాడి; కాల్పుల్లో జేమ్స్ గాయపడటం
గాయపడిన కానిస్టేబుల్ ఆదినారాయణ, నిందితుడు జేమ్స్ లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో కొందరైన నాగుల జానకిరామ్ (నాలుగో మైలు, నెల్లూరు రూరల్), ధారా విష్ణువర్ధన్ (తడికల బజార్), ఆరవ సంతోష్ (ఆర్ డిటి కాలనీ), మిందాల రోహిత్ (రంగనాయకుల పేట), ఈగ వినయ్ (సెట్టిగుంట రోడ్డు), కల్లూరు సంతోష్ (నవాబుపేట), అరవ జోసెఫ్ (బోడి గాడి తోట)లను ఆమంచల సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి హత్య కోసం ఉపయోగించిన మూడు ద్విచక్ర వాహనాలు, ఏడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పథక రచన చేసిన అరవ కామాక్షిని గంజాయి కేసులో ఆదివారం నవాబుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పిటి వారెంట్ కింద ఆమెను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జేమ్స్ ను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. మిగతా నిందితులను కూడా త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ తెలిపారు. సంచలనం కలిగించిన హత్య కేసులో నిందితులను త్వరగా పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన నెల్లూరు రూరల్ సీఐ జి.వేణు, వేదయపాలెం సిఐ కె. శ్రీనివాస రావులను ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రకటించిన రివార్డులను డిఎస్పి వారికి అందజేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: