ఆధునిక కాలంలో AI టెక్నాలజీతో పోటీ పడుతున్నా తరుణంలో కూడా కుల బహిష్కరణ సంఘటనలు చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ఇదే తరహా సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు (Nangunur)మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేయాలేదనే నేపంతో రెడ్డి కుల సంఘం నాయకులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి చల్లారం వెంకట కృష్ణారెడ్డి దాడికి పాల్పడ్డారని, కుల బహిష్కరణ చేశారని బాధితుడు చల్లారం మధుసూధన్ రెడ్డి ఆరోపణలు చేశారు.
Read also: Ameenpur crime: ఉరివేసుకొని భర్త భార్య ఆత్మహత్య
ఆదివారం రోజున తనను ఇంటి నుండి రెడ్డి సంఘం భవనం వద్దకు పిలుపించుకొని తన అనుచరులతో కలిసి దాడి చేశాడని బాధితుడు తెలిపాడు. గతంలో తన తండ్రి దేశమంతా రెడ్డిని రెడ్డి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మొన్నటి సర్పంచ్ ఎలక్షన్స్ లో రెడ్డి కులానికి చెందిన వ్యక్తికి కాకుండా(Nangunur) బీసీ కులానికి చెందిన వ్యక్తికి సపోర్ట్ చేశామనే కారణంతో అధ్యక్ష పదవికి మీరు అర్హులు కాదని, అలాగే కులం నుండి బహిష్కరిస్తున్నామంటూ దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. చల్లారం వెంకట కృష్ణారెడ్డితో పాటు తన వెంట ఉండే కొందరి అనుచరులతో తనకు ప్రాణ భయం ఉందని పోలీసులు తనకు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: