Nalgonda crime: నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘోర హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుల భారంతో ఉన్న రాములు–ధనలక్ష్మి దంపతులు, వారి కుమారుడు సాయి కుమార్ కలిసి 67 ఏళ్ల వ్యవసాయ కూలీ సుంకిరెడ్డి అనసూయమ్మను హత్య (murder) చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Read also: Tirupati: చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్

తలపై బలంగా కొట్టి, గొంతు కోసి ప్రాణాలు
రేషన్ బియ్యానికి సంబంధించిన రూ.300 చెల్లిస్తామని మోసపూరితంగా చెప్పి అనసూయమ్మను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు రప్పించిన నిందితులు, అక్కడ ఆమెపై దాడి చేశారు. తలపై బలంగా కొట్టి, గొంతు కోసి ప్రాణాలు తీసిన అనంతరం, ఆమె ధరించిన సుమారు నాలుగు తులాల బంగారు(Gold Robbery) ఆభరణాలను అపహరించారు. ఆధారాలు బయటకు రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పూడ్చివేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: