నాగ్‌పూర్ నగరంలో ఒక విద్యార్థినిపై జరిగిన హత్య కలకలం రేపింది. ప్రేమను అంగీకరించలేదనే కారణంతో ప్రాచీ అనే యువతిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేరాన్ని ఆత్మహత్యగా చూపించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మొదట పోలీసులు దీనిని సాధారణ ఆత్మహత్యగా (suiside) భావించారు. కానీ కేసులో అనుమానాస్పద అంశాలు బయటపడటంతో విచారణ మలుపు తిరిగింది.
Read also: Rajahmundry Accident: బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు?

Student brutally murdered for rejecting a love proposal
పోస్టుమార్టం నివేదికతో బయటపడ్డ నిజం
మృతురాలికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో తలకు తీవ్రమైన గాయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని స్పష్టమైంది. దీంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలంలో లభించిన ఆధారాలు, బాధితురాలి నేపథ్యం పరిశీలించగా ప్రేమ నిరాకరణే కారణమని తేలింది. ఈ ఘటన యువతలో పెరుగుతున్న దురాలోచనలకు అద్దం పడుతోంది.
నిందితుడి అరెస్టు – ఒప్పుకున్న నేరం
మృతురాలి పక్కింట్లో నివసిస్తున్న శేఖర్ అజబ్రావ్ ధోరేపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రశ్నించినప్పుడు మొదట తప్పించుకునే ప్రయత్నం చేసిన అతడు, ఆధారాలు చూపించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రేమను తిరస్కరించిందనే కోపంతో హత్య చేసి, ఉరివేసి ఆత్మహత్యలా చిత్రీకరించినట్లు వెల్లడించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: