Maharashtra News: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 12 ఏళ్ల బాలుడు(Nagpur Child) తల్లిదండ్రుల దారుణ ప్రవర్తనకు గురయ్యాడు. ఇంట్లో నుంచి పారిపోతున్నాడని, ఇతరుల ఫోన్లు దొంగిలిస్తున్నాడని ఆరోపిస్తూ, తల్లిదండ్రులు ఆయనను ఇనుప గొలుసులతో కట్టేశారు.
Read also: Mexico Earthquake: మెక్సికోలో భారీ భూకంపంతో కంపించిన భవనాలు..


సౌత్ నాగ్‌పూర్‌లో నివసిస్తున్న బాలుడు స్కూలుకు వెళ్లకుండా తిరుగుతూ ఉండటంతో తల్లిదండ్రులు ప్రతిరోజు ఉదయాన్నే పనికి వెళ్ళేముందు ఇంటి బయట బాలుడిని గొలుసులతో బంధిస్తూ తాళాలు వేస్తున్నారు. సాయంత్రం తిరిగి వచ్చాకే గొలుసులు తీస్తారు. ఈ విధానం దాదాపు రెండు నెలలపాటు కొనసాగింది.
గొలుసులు బంధించడం వల్ల బాలుడి చేతులు, కాళ్లలో గాయాలు అయ్యాయి. పరిసర ప్రాంతపు వ్యక్తులు ఈ పరిస్థితిని గమనించి స్థానిక అధికారులు, జిల్లా మహిళా-శిశు అభివృద్ధి శాఖకు ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే చేరి బాలుడిని విడుదల చేసి, భయాందోళనలో ఉన్న అతన్ని షెల్టర్ హోమ్(Shelter Home)కు తరలించి, కౌన్సెలింగ్ అందిస్తున్నారు.
తల్లిదండ్రులపై జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, బాలుడి హితార్థం కోసం దర్యాప్తు ప్రారంభించబడింది. స్థానిక సమాజం ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: