కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) వ్యాధి తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.’బ్రెయిన్-ఈటింగ్ అమీబా’గా పిలుస్తున్న నాగ్లేరియా ఫౌలెరీ కారణంగా ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం) వ్యాధి కేరళను వణికిస్తోంది. 2025లో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 69 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
Crime:హోంవర్క్ చేయలేదని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపాల్.. ఎక్కడంటే?
ఈ వ్యాధికి గురైనవారిలో మూడు నెలల పసికందు నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకు ఉండటం గమనార్హం. ఈ అమీబా (amoeba) వెచ్చని, నిల్వ ఉన్న మంచినీటిలో నివసిస్తుంది. ముఖ్యంగా చెరువులు, నదులు, సరైన క్లోరినేషన్ లేని స్విమ్మింగ్ పూల్స్‌లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ అమీబా కలుషితమైన నీటిలో స్నానం చేయడం లేదా ఈత కొట్టడం ద్వారా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
అక్కడి నుండి మెదడుకు చేరుకుని, మెదడు కణజాలాన్ని వేగంగా నాశనం చేస్తుంది. ఇది ప్రాణాంతకమైన మెదడు వాపు (Brain swelling) కు దారితీస్తుంది.ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో సాధారణ జ్వరం లేదా మెదడువాపు వ్యాధిని పోలి ఉంటాయి. వాటిలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ పట్టేయడం, మూర్ఛ వంటివి ఉంటాయి. వ్యాధి ముదిరే కొద్దీ, స్పృహ కోల్పోవడం, కోమా వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈత కొట్టకుండా జాగ్రత్త వహించాలని ఆరోగ్య శాఖ సూచించింది
ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి మరణాల రేటు 97 శాతం కాగా, కేరళ (Kerala) లో మెరుగైన నిర్ధారణ, చికిత్స వల్ల మరణాల రేటు 24 శాతంగా ఉంది.కేసుల పెరుగుదల నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ (High Alert) ను ప్రకటించింది. ప్రతి ఎన్సెఫాలిటిస్ కేసును నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది.
దీనివల్ల అమీబా కేసులను త్వరగా గుర్తించడం సాధ్యమైంది. ప్రజలు కలుషిత నీటిలో స్నానం చేయకుండా, ఈత కొట్టకుండా జాగ్రత్త వహించాలని ఆరోగ్య శాఖ సూచించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యాప్తిపై నిఘా పెట్టింది.
జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) సహాయంతో చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యాధి విషయంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: