దేశాన్ని షాక్‌కు గురిచేసే దారుణ ఘటన ముంబైలో (Mumbai) వెలుగులోకి వచ్చింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడన్న కోపంతో ఓ వివాహిత, తన ప్రియుడిపై అమానుషంగా దాడి చేసింది. న్యూ ఇయర్ స్వీట్స్ ఇస్తానంటూ నమ్మించి ఇంటికి పిలిచి, కత్తితో మర్మాంగంపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితురాలు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

Mumbai Crime
ఏడేళ్ల వివాహేతర సంబంధం.. పెళ్లి కోసం ఒత్తిడి
పోలీసుల కథనం ప్రకారం, 25 ఏళ్ల మహిళకు 44 ఏళ్ల వ్యక్తికి గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ బంధువులేనని తెలుస్తోంది. అయితే, భార్యను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలంటూ మహిళ కొంతకాలంగా అతడిపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆమె ఒత్తిడిని తట్టుకోలేక బాధితుడు 2025 నవంబర్‌లో బిహార్‌లోని తన స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడికీ ఆమె ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
న్యూ ఇయర్ రాత్రి నమ్మించి పిలిచి దాడి
డిసెంబర్ 19న ముంబైకి తిరిగి వచ్చిన బాధితుడు, ఆమెతో సంబంధాలు పూర్తిగా తెంచుకుని దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో న్యూ ఇయర్ స్వీట్స్ ఇస్తానంటూ ఆమె అతడిని తన ఇంటికి రప్పించింది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ప్యాంటు విప్పమని చెప్పి, వంటగది నుంచి కూరగాయలు కోసే కత్తిని తీసుకొచ్చి మర్మాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో గాయపడిన అతడు అక్కడి నుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకున్నాడు.
కుటుంబ సభ్యులు అతడిని మొదట వీఎన్ దేశాయ్ ఆసుపత్రికి, అనంతరం సియోన్ ఆసుపత్రికి తరలించారు. గాయం చాలా లోతుగా ఉందని, అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: