Telangana crime: జీవితం విలువైనది. అందమైనది కూడా. అలాగని అన్నీ సుఖాలు, ఆనందాలే ఉంటాయని అనుకోకూడదు. రాత్రీపగలు, చీకటి వెలుగు ఉన్నట్లుగానే కష్టాలతోనే సుఖాలు కూడా ఉంటాయని గ్రహించాలి. మనం ప్రేమించేవారు మనల్ని మోసం చేయవచ్చు. లేదా ఇతరుల కారణంగా మనం నష్టం కలగవచ్చు. అంతమాత్రాన ప్రాణాలు తీసుకోకూడదు. (Telangana crime)మొన్న ఆంధ్రప్రదేశ్లో కుటుంబ కల హాలతో ఓ తండ్రి తన ముగ్గురు బిడ్డల్ని పెట్రోలు పోసి చంపి, అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను కడతేర్చింది.
గొడవలతో విసిగివేసారి..
సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సంగమేశ్ తో ఓ మహిళకు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అప్పటటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్నంగా .. హ్యాపీగా గడిపింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హాయిగా జీవించారు. అయితే ఇటీవల ఈ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. గొడవలకు కారణాలు తెలియకపోయినా తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇవి తారాస్థాయికి చేరుకునేసరికి భర్త సంగమేశ్ తన భార్యా పిల్లల్ని పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
దీంతో భార్య ఆవేదనకు గురై తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి చంపి, అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మరణించిన వారిలో రెండు నెలల పసికందు కూడా ఉండడం అత్యంత విషాదకరం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఏదో కుటుంబ కలహాలతో తన భార్యను, పిల్లల్ని పుట్టింట్లో వదిలేసి వచ్చిన భర్త, తన భార్య ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయాడు. రెండునెలల పసికందు అనే జాలి కూడా లేకుండా ఇద్దరు పిల్లల్ని చంపి, భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. పిల్లల్ని చంపి, ఆత్మహత్య చేసుకునేంత గొడవలు ఏం ఉన్నాయని ఇరువురి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తమకు చెప్పుకుంటే ఇంత దారుణం జరగకుండా చూసేవారమని రోదిస్తున్నారు.
Read also :