కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలించే ప్రయత్నంలో ఆమె విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఈ కేసు నేపథ్యంలో బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
బీజాపూర్ సిటీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ మాట్లాడుతూ‘ఆమె (రన్యారావు) తన శరీరమంతా బంగారంతో కప్పేసింది. తన ప్రైవేట్ భాగాల్లో బంగారం దాచి స్మగ్లింగ్ చేసింది. ఈ కేసులో రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రుల ప్రమేయం ఉంది. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాను. రన్యారావుకు ఎయిర్‌పోర్ట్‌లో ఎవరు సహకరించారు, బంగారం ఎలా తీసుకొచ్చారు వంటి విషయాలన్నీ శాసనసభ సమావేశాల్లో బహిర్గతం చేస్తాను.ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న మంత్రుల బండారం కూడా బయటపెడతాను’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్
రన్యా రావు దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఎస్) అధికారులు లావెల్లె రోడ్‌లోని ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.2.06 కోట్ల విలువైన బంగారు నగలు, రూ.2.67 కోట్ల నగదు పట్టుబడ్డాయి. దీంతో పట్టుబడిన మొత్తం నగదు, బంగారం విలువ 17.29 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, తాను ఏతప్పూ చేయలేదని.. తప్పుడు కేసులో ఇరికించారంటూ పేర్కొన్నారు. తనను విమానంలోనే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వివరణ ఇవ్వడానికి కూడా అధికారులు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.

అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని రన్యా రావు స్పష్టంగా తెలిపింది. “నన్ను విమానంలోనే అరెస్ట్ చేశారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఇది పూర్తిగా తప్పుడు కేసు. వివరణ ఇచ్చే అవకాశం కూడా కల్పించలేదు” అంటూ ఆరోపించింది. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆమె వాదిస్తున్నారు.ప్రస్తుతం రన్యా రావు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.ఈ కేసు ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంది. “ఈ కేసులో ఉన్న అసలు పెద్దపులుల వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది” అని ఆయన డిమాండ్ చేశారు.