నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో గంజాయి గ్యాంగ్‌ల వల్ల పట్టణంలో శాంతి భద్రతలు భంగం కలిగే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా (Miryalaguda) పట్టణంలోని బంగారుగడ్డ ప్రాంతంలో చోటుచేసుకున్న దారుణ సంఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనకు కారణమైంది.ఒక యువకుడిపై దాదాపు పది మంది గంజాయి బ్యాచ్ యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. బంగారుగడ్డ ప్రాంతంలోని పప్పు మిల్లు (Pulse mill) వద్ద ఉన్న యువకుడిని ఈ గ్యాంగ్ ముట్టడించింది. మొదట మాటామాటా జరిగి, ఆపై ఒక్కసారిగా వారు దాడి చేయడం ప్రారంభించారు.
దర్యాప్తు ప్రారంభించారు
కొట్టొద్దని ఎంత బతిమాలినా వినకుండా యువకుడిపై పిడిగుద్దులు, కాళ్లతో తన్నులు కురిపించారు. తన్నుతూ, లాగుతూ కొద్ది నిమిషాలపాటు ఆ యువకుడిని తీవ్రంగా గాయపరిచారు.పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. పప్పు మిల్లు సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు.
మిర్యాలగూడ ఎక్కడ ఉంది?
మిర్యాలగూడ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఉన్న ఒక ముఖ్య పట్టణం.
మిర్యాలగూడలో నీటి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి?
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి నీరు అందడంతో మిర్యాలగూడ, పరిసర ప్రాంతాలు సస్యశ్యామలం అవుతున్నాయి.
Read hindi news:
Read Also: