పాపన్న పేట:(మెదక్) మానవత్వం మంటగలిస్తున్నాయి. కాసుల కోసం కన్న తండ్రినే అంతమొందించాడు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని సీతానగర్ గ్రామంలో లంగిడి లక్ష్మయ్య (48) బార్య శేఖమ్మ లకు ఇరువురు కుమారులు శ్రీకాంత్, శివలు కాగా పెద్ద కుమారుడు శ్రీకాంత్ వివాహం చేసి ఉన్న రెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం తోపాటు ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా పెద్ద కుమారుడు శ్రీకాంత్ త్రాగుడుకు బానిసై పని బాట చేయకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి డబ్బులు కోసం తరచు తండ్రి తో గొడవ పడేవాడు.
Read also: Bangladesh: బంగ్లాలో ఆగని దాడులు.. మరో హిందూ హత్య?

A son killed his father for money
డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో
అయితే సోమవారం రాత్రి శ్రీకాంత్ అతిగా మద్యం సేవించి మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తండ్రి లక్ష్మయ్య తో గొడవ పడి మృతుడు డబ్బులు లేవని తెలుపడంతో కోపాద్రికుడైన తనయుడు అక్కడే ఉన్న కర్రతో తలపై మోదడంతో తీవ్ర రక్త స్రావం కావడంతో కుటుంబీకులు వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న మృతుడిని అంబులెన్స్ లో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో కుటుంబీకులు పాపన్న పేట పోలీసులకు సమాచారం అందించడం తో పాపన్న పేట పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి ఎలాంటి గొడవలు జరగకుండా గస్తీ ఏర్పాటు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాగా మృతుడికి భార్య శేఖమ్మ, ఇరువురు కుమారులు ఉన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: