మహారాష్ట్రలోని (Maharashtra) థానే జిల్లాలో కుటుంబ కలహం భయంకర ముగింపుకు దారితీసింది. భర్త మరణానంతరం కోడలు రూపాలికి వచ్చిన గ్రాట్యుటీ డబ్బు విషయంలో అత్త–కోడల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది. సుమారు రూ.10 లక్షల గ్రాట్యుటీ మొత్తాన్ని మనవడి భవిష్యత్తుకు ఉపయోగించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశంతో అత్త లతాబాయి ఒత్తిడి చేసింది. అయితే ఆ డబ్బుపై తనకే హక్కు ఉందని రూపాలి స్పష్టంగా నిరాకరించింది.
Read also: UP: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్ బిహారీ లాల్ కన్నుమూత

daughter-in-law murdered by mother-in-law
ఈ వివాదం చివరకు దారుణ హత్యకు దారి తీసింది. కోపంతో ఊగిపోయిన లతాబాయి తన స్నేహితుడు జగదీష్ మహాదేవ్ మాత్రేతో కలిసి ఐరన్ రాడ్‌తో రూపాలిపై దాడి చేసింది. తీవ్ర గాయాల కారణంగా రూపాలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మృతదేహాన్ని బయట పడేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి, 24 గంటల్లోనే కేసును ఛేదించి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన కుటుంబ సంబంధాల్లో ఆర్థిక అంశాలు ఎంత ప్రమాదకరంగా మారతాయో మరోసారి నిరూపించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: