మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. నూడుల్స్ ఆర్డర్ (noodles Order) అంశంపై మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు రాడ్లు మరియు కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు మెడికోలు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Babri Masjid Issue: బంగాల్లో టెన్షన్ టెన్షన్
ఈ సంఘటన డిసెంబర్ 4న ఎయిమ్స్ భోపాల్‌లో జరిగిన రెటీనా ఫెస్ట్ (Retina Fest) అనంతరం జరిగింది. గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు అర్ధరాత్రి వేళ క్యాంపస్‌కు తిరిగి వచ్చారు. వీరిలో కొందరు మద్యం మత్తులో ఉన్నారు. ఒక కేఫ్ వద్ద నూడుల్స్ ఆర్డర్ ఇవ్వగా, ‘నూడుల్స్ మొదట ఎవరు పొందాలి’ అన్నదానిపై విద్యార్థుల మధ్య గొడవ ప్రారంభమైంది.

2024 బ్యాచ్‌కు చెందిన పరాస్‌ను సుమారు 15 మంది విద్యార్థులు చుట్టుముట్టి కర్రలతో కొట్టారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ శైలేష్ చౌదరి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా, దాడి చేసిన విద్యార్థులు ఆయన్ని దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ శైలేష్ చౌదరిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. చేతికి, భుజానికి గాయాలైన పరాస్‌ను చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.
15 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
ఈ ఘటనపై గాంధీ మెడికల్ కాలేజీ (Gandhi Medical College) యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. డిసెంబర్ 5న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ఈ హింసాత్మక చర్యకు పాల్పడిన 15 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, హాస్టల్‌ను వెంటనే ఖాళీ చేయాలని వారిని ఆదేశించింది. క్యాంపస్‌లో హింసను సహించబోమని, కఠినమైన చర్యలు తీసుకుంటామని డీన్ డాక్టర్ కవితా ఎన్ సింగ్ హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: