మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) విదిశా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బతికున్న కుమార్తెకు తండ్రే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
Read Also: Bapatla: క్రేన్ లో అగ్నిప్రమాదం: షార్ట్ సర్క్యూట్ తో మంటలు

యువతి అదృశ్యం, పోలీసుల విచారణ
23 ఏళ్ల సవిత కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు(Madhya Pradesh) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాన్ని గుర్తించారు. దర్యాప్తులో సవిత ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని అతడితో కలిసి నివసిస్తోందని తేలింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబం తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
కూతురు నిర్ణయాన్ని తట్టుకోలేక తండ్రి చర్య
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కుటుంబాన్ని వదిలి వెళ్లిందన్న నిజం తండ్రిని మానసికంగా కుంగదీసింది. సమాజంలో పరువు పోయిందన్న భావనతో ఆయన కూతురు చనిపోయినట్టే భావించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విస్తృత చర్చకు దారి తీసింది. వ్యక్తిగత నిర్ణయాలపై కుటుంబాల స్పందన, సామాజిక ఒత్తిళ్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: