Madanapalle Case: మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అమానుషానికి ఒడిగట్టిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న ఉదంతంపై తెలుగుదేశం పార్టీ (TDP) సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నేరస్థుల్లో నెలకొన్న భయమే వారిని ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని టీడీపీ పేర్కొంది.
Read Also: Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్
దాచేపల్లి నుంచి మదనపల్లె వరకు..
2018లో జరిగిన దాచేపల్లి ఘటనను గుర్తు చేస్తూ, అప్పటి నుంచి నేటి మదనపల్లె వరకు ఇలాంటి దారుణాలకు పాల్పడిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ గుర్తు చేసింది. తప్పు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరనే గట్టి నమ్మకం, భయం నేరగాళ్లను వెంటాడుతున్నాయని ఆ పార్టీ అభిప్రాయపడింది.
నేరస్థులకు హెచ్చరిక
రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడే వారు చట్టం నుంచి తప్పించుకోలేరని, ఆ భయమే వారిని ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించిందని టీడీపీ సోషల్ మీడియా పోస్ట్‌లో స్పష్టం చేసింది. ప్రభుత్వ కఠిన వైఖరి వల్లే నేరస్థులు వణికిపోతున్నారని వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: