మూగజీవాలను ప్రేమించాలని, వాటిని సంరక్షించాలనే నినాదం చాలామంది సెలబ్రిటీలు చేశారు. నిజమే మూగజీవాలను ప్రేమించాలి, కానీ మానవుడిని మరింతగా ప్రేమించాలి. ఎందుకంటే జంతువుల కంటే మానవుడి ప్రాణం ముఖ్యం. అందుకే సుప్రీంకోర్టు ఇటీవల వీధికుక్కల నియంత్రణలో పలు కీలకఆదేశాలను జారీ చేసింది. వీధి కుక్కల్ని షెల్టర్ హోమ్ల (Shelter homes) లో ఉంచాలని ఆదేశించింది. కుక్కకాటుతో ఎందరో పిల్లలు మరణించారు. పెద్దలూ గాయపడ్డారు. తాజగా ఓ కుక్క మొరగడంతో దాన్ని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ ట్రక్కును గుద్దుకుని మరణించారు.
షాకింగ్ వీడియో
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వీడియో మాత్రం షాకింగ్ కు గురిచేస్తున్నది. ఒక వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదీకూడా ఫుట్ బోర్డుపై. పక్కనే ఓ కుక్క మొరగడం ప్రారంభించింది. అకస్మాత్తుగా కుక్క బిగ్గరగా మొరగడంతో అతడు తనను కరుస్తుందని భయపడ్డాడు. కుక్క నుంచి తననుతాను కాపాడుకునే ప్రయత్నంలో రోడ్డువైపు పరిగెత్తే ప్రయత్నం చేశాడు.
అప్పుడే వేగంగా ఓ ట్రక్కు వచ్చి, ఆ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతడు ఆపస్మారకస్థితిలోకి
వెళ్లిపోయాడు. ఈ హృదయ విదారక సంఘటన వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్ గా మారింది. వీధుల్లో ప్రమాదకరంగా మారుతున్న కుక్కల నియంత్రణకుకఠిన చర్యలు తీసుకోవాలని వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. కుక్కలప్రేమికుల్లారా ఈ వీడియోను చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ కామెంట్ పెడుతూ మండిపడుతున్నారు.
కుక్కల నుంచి ప్రజల్ని కాపాడాలి
కాగా ఇటీవల కుక్కల దాడులు అధికం అవుతున్నాయి. వీధుల్లో నడుస్తున్న బాటసారులపై కుక్కలు తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. ప్రత్యేకంగా వృద్ధులు,పిల్లలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు వాటిపై ఏకంగా నాలుగైదు కుక్కలు పోగై దాడులు చేస్తున్నాయి. కుక్కల దాడులతో ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇంటిముందు నిద్రిస్తున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేశాయి. నాలుగేళ్ల ఒంటరి బాలుడిపై కుక్కలు పీక్కుతిన్నాయి.
ఇలాంటి హృదయవిదారకసంఘటలు నిత్యం జరుగుతున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారికే తెలియాలి. కుక్కలు కరవడంతో వారు రేబిస్ (Rabies) వ్యాధులకు గురవుతున్నారు. రేబిస్ కు తగిన మందులు అన్ని ప్రాథమిక ఆసుపత్రుల్లో లేవు. సకాలంలో వైద్యం అందక రేబిస్ వ్యాధితో బాధపడుతూ మరణించినవారు ఉన్నారు. తాజా సంఘటన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: