భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంఘటన సమాజాన్ని కుదిపేస్తోంది. పెళ్లి ముహూర్తం కుదరకముందే కాబోయే వాడు తన వధువుపై దారుణంగా వ్యవహరించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఒళ్లంతా గాయాలతో వణికిపోయిన ఆ యువతి కన్నీళ్లు చూడగానే కన్నవాళ్లు కుదేలయ్యారు. పెళ్లి కాని ముందే ఇంత కర్కశంగా వ్యవహరించిన వాడు పెళ్లయ్యాక ఏ స్థాయిలో ఉంటాడోనని భయంతో ఆ యువతి చివరికి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.పూర్తి వివరాలు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem District) టేకులపల్లి మండలం వెంకట్యతండాకు చెందిన తుళ్లిక శ్రీకి, లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురవాసి బానోతు బిచ్చకు పెళ్లి చేయాలని ఇరువైపుల పెద్దలు నిర్ణయించారు. మూడు నెలల క్రితమే మాటాముచ్చట పూర్తయింది. బిచ్చా తనను ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగి అని, నెలకు లక్ష రూపాయలకుపైగా వేతనం వస్తుందని చెప్పాడు.
కాల్స్, మెసేజ్‌లతో తక్కువ టైమ్
బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన తుళ్లిక శ్రీ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. కట్నం కింద 60 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు.ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడాలు.. కాల్స్, మెసేజ్‌లతో తక్కువ టైమ్‌లోనే దగ్గరైపోయారు. అప్పుడప్పుడు ఇంటికొచ్చి దైవ దర్శనాలకు తీసుకెళ్తానంటే బిచ్చాతో తుళ్లిక శ్రీ (Tullika Sri) ని పంపించేవాళ్లు పేరెంట్స్. అలా ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారట. ఈనెల 8న బావ కొడుకు బర్త్‌డే ఉందంటూ బయటకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. తుళ్లిక శ్రీ నీరసంగా కనిపించడంతో ఏమైందని అడిగారు తల్లిదండ్రులు. దీంతో బిచ్చా పెట్టిన టార్చర్‌ని పూసగుచ్చినట్టు వివరించింది. వేరే అబ్బాయి మెసేజ్ పెడితే.. సంబంధం అంటగట్టి దారుణంగా కొట్టాడని కన్నీటిపర్యంతమైంది.
పెళ్లి పేరుతో మోసం చేశాడని
ఆ క్రమంలోనే ఇక పెళ్లి చేసుకునేది కూడా లేదని.. చస్తే చావంటూ మెసేజ్ పెట్టాడు బిచ్చా. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తుళ్లిక శ్రీ.. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులు ట్రీట్‌మెంట్ అందించినా ఫలితం లేకుండాపోయింది. పరిస్థితి విషమించి తుళ్లిక శ్రీ చనిపోయింది.బిచ్చా ఇంతకుముందు కూడా ముగ్గురు యువతులను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించారు తుళ్లిక శ్రీ బంధువులు. అలాంటివాడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తుళ్లిక శ్రీలాంటి మరో యువతి అతని బారినపడకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన టేకులపల్లి పోలీసులు.. పరారీలో ఉన్న బిచ్చా కోసం గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: