దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ (Meghalaya Honeymoon) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసు దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు, మొత్తం 970 పేజీల ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్‌లో చేసిన వివరణలు ఒక్కొక్కటి షాకింగ్ విషయాలను బయటపెడుతున్నాయి. వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య వెనుక ఆయన భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా.
కుట్ర ప్రధాన కారణమని పోలీసులు స్పష్టం చేశారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ ఈ ఏడాది మే 11న సోనమ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్ళిన దంపతులు సంతోషంగా ఉన్నారని తెలిసినా, వాస్తవానికి మాత్రం అప్పటికే ఘోర కుట్ర జరుగుతోందని పోలీసులు ఛార్జిషీట్ (Charge sheet) లో పేర్కొన్నారు. సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలసి, పెళ్లికి ముందే ఈ హత్య ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తేలింది.
విచారణలో సేకరించిన కీలక ఆధారాలు
పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో, ఈ కేసు విచారణలో సేకరించిన కీలక ఆధారాలు, నిందితుల కాల్ డేటా రికార్డులు, వారి మధ్య జరిగిన సంభాషణలు,హత్యకు దారితీసిన పరిస్థితుల గురించి విపులంగా వివరించారు. ఈ 970 పేజీల ఛార్జిషీట్‌లో హంతకులు ఈ హత్య కోసం మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని, చివరికి నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని కూడా పోలీసులు తెలిపారు.
ఈ ఛార్జిషీట్‌ను సమర్పించిన తర్వాత రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాజా సోదరుడు విపిన్ రఘువంశీ మీడియాతో మాట్లాడుతూ, నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో దర్యాప్తును పూర్తి చేసి, అన్ని ఆధారాలను సేకరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిందితులందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో త్వరలో విచారణ ప్రారంభం కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: