హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి (Kukatpally) లో జరిగిన బాలిక హత్య కేసు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలకు వెళ్లే ఒక చిన్నారి బాలికను దారుణంగా హత్య చేసిన ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. చివరికి పోలీసులు మిస్టరీని ఛేదించి నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో నిందితుడిగా గుర్తించబడినవాడు పదో తరగతి చదువుతున్న సాయి. ప్రేమ పేరుతో ఈ దారుణం జరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

ప్రేమోన్మాది సాయి పనిగా తేల్చిన పోలీసులు
పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం,ప్రేమను ఒప్పుకోలేదని పదో తరగతి కుర్రాడు సాయి (Sai) బాలికను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయిని అక్కడ సంచరించినట్లు స్థానికులు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. మర్డర్ మిస్టరీని చేధించారు. స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును చేధించిన పోలీసులు. పోలీసుల విచారణలో తొలుత సాయి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. క్రికెట్ ఆడేందుకు సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్టు పోలీసులను మాయ చేయాలని చూశాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో.. నేరాన్ని అంగీకరించాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: