కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో (residential school) 9వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని స్కూల్ టాయిలెట్‌లో బిడ్డకు జన్మనివ్వడం సంచలనాన్ని సృష్టించింది. ఈ ఘటన వెలుగులోకి రాగానే పాఠశాల అధికారులు, స్థానిక ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.వివరాల ప్రకారం, బాలికకు అకస్మాత్తుగా ప్రసవ వేదనలు రావడంతో టాయిలెట్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. సంఘటనను గమనించిన స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి, తల్లీబిడ్డను సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. ఈ పరిణామం తల్లిదండ్రులు, బంధువులు, సమాజంలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది.
బాలల హక్కుల కమిషన్ సభ్యుడు
10 నెలల క్రితం విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయంపై మాట్లాడేందుకు బాలిక నిరాకరించింది. ఈ సంఘటన గురించి కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు శశిధర్ కొసుంబే (Shashidhar Kosumbe) తెలియజేశారు. కమిషన్ ఈ కేసును తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు ప్రారంభించింది. జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారిని పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆదేశించింది.జిల్లా మేజిస్ట్రేట్ హర్షల్ భోయార్ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. పాఠశాల సిబ్బంది, వార్డెన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పోలీసులు ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్, స్టాఫ్ నర్సు,బాధితురాలి సోదరుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారుపూర్తి దర్యాప్తు తర్వాత మరిన్ని సెక్షన్లను కూడా చేర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పాఠశాలల్లో భద్రత, పర్యవేక్షణపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

జూన్‌లో పాఠశాల ప్రారంభమైనప్పటి నుండి ఆ విద్యార్థిని తరచుగా గైర్హాజరయ్యేదని
ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ బసమ్మ మాట్లాడుతూ, తాను నెల రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. రికార్డుల ప్రకారం ఆ విద్యార్థిని వయస్సు 17 సంవత్సరాల 8 నెలలు అని ఆమె వెల్లడించారు. ఆ బాలిక గర్భం దాల్చిందనే విషయం కానీ, దాని లక్షణాలు కానీ తమకు ఎప్పుడూ కనిపించలేదని ప్రిన్సిపాల్ చెప్పారు. జూన్‌లో పాఠశాల ప్రారంభమైనప్పటి నుండి ఆ విద్యార్థిని తరచుగా గైర్హాజరయ్యేదని, ఆగస్టు 5 నుంచి మాత్రమే క్రమం తప్పకుండా హాజరవడం మొదలుపెట్టిందని ఆమె వివరించారు. అయితే, ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందనే విషయం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నించగా వారు నిరాకరించారని ఆమె చెప్పారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: