కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bangalore) లో ఒక విషాదకర సంఘటన వెలుగుచూసింది. వరకట్న వేధింపులను తట్టుకోలేక పూజశ్రీ అనే 28 ఏళ్ల గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, మరోసారి వరకట్న సమస్య ఎంత పెద్ద సామాజిక శాపంగా మారిందో బయటపెట్టింది.మృతురాలు పూజశ్రీకు మూడు సంవత్సరాల క్రితం నందీప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ వివాహం కొన్నాళ్ల పాటు సుఖసమృద్ధిగా సాగింది. భర్త–భార్య మధ్య ఎలాంటి గొడవలు లేకుండా కుటుంబం సంతోషంగా గడిచింది. వీరిద్దరికీ ఒక చిన్నారైన కుమార్తె కూడా పుట్టింది. ఈ చిన్నారి పుట్టడం ఇరువురు కుటుంబాల్లోనూ ఆనందాన్ని నింపింది.

అదనపు వరకట్నం కోసం వేధింపులు
కానీ ఇటీవల కాలంలో భర్త అదనపు కట్నం (additional dowry) కోసం ఆమెను వేధిస్తున్నట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.అయితే నందీప్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత నుంచే ఇంట్లో వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయని వారు చెప్పుకొచ్చారు. అదనపు కట్నం డిమాండ్ చేయడమే కాకుండా సందీప్ రోజూ భార్యతో గొడవలు పడేవాడని ఆరోపించారు. ఈ వేధింపులు భరించలేకనే పూజశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని వారు పేర్కొన్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: