ప్రభుత్వ ఉద్యోగి అయితే చాలు ఆ జీవితమే వేరుగా ఉంటుంది, ఏవిధంగానైనా గవర్నమెంట్ జాబ్ పొందాలి అని,అనేకులు అనుకుంటారు. ఎందుకంటే ‘ప్రభుత్వ ఉద్యోగి (Government employee) అంటే లక్షల్లో జీతాలు వస్తాయి. మొదటితారీఖు వస్తే అకౌంట్లో,లక్షల్లో జీతాలు పడతాయి. అయినా కొందరికీ అంత జీతం తీసుకుంటున్నా తృప్తి ఉండదు.
ఇంకా సంపాదించాలి, స్వల్పకాలంలోనే కోటీశ్వరులు అయిపోవాలనే తపనతో అడ్డదారులు తొక్కుతున్నారు. లంచం ఇస్తే తప్ప ఫైల్ కదలదని తెగేసి,చెబుతున్నారు. తమకు చేతివాటం అందితేనే తప్ప మీ పనులు ముందుకు సాగవని హుకుం జారీ చేస్తున్నారు. తాజాగా,ఇలాంటి డిమాండే చేసింది ఓ మహిళా అధికారిణి.

10 లక్షలు డిమాండ్ చేసిన అధికారిణి
నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణిగా ఉన్న మహిహారిక ఏసీబీ వలలోపడింది.నార్సింగ్ మున్సిపాలిటీ (Narsingh Municipality) పరిధి లోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్ లో ఒక ప్లాట్కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎస్ఆర్ఎస్) క్లియరెన్స్ఇచ్చేందుకు మహిహారిక రూ. 10లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ. 4లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీఅధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వినోద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వరంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ (ACB) రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పుడు మహిహారిక తాను ఏ పాపం ఎరుగనని వేడుకుంటూ కన్నీరు కార్చడం కొసమెరుపు. మన,సమాజంలో అవినీతి వేళ్లూనికునిపోయింది. చేతి తడపనిదే పనులు సాగడం లేదు. అటెండర్ దగ్గర నుంచి కమిషనర్ వరకు కొందరి అవినీతి వల్లే సమాజం భ్రష్టుపడుతున్నది. ఇలాంటి చీడపురుగులకు కఠినమైన శిక్షలు విధించాలి అనిప్రజలు కోరుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: