హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి (Kukatpally) లో చోటుచేసుకున్న మైనర్ బాలిక హత్య కేసు తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన నాటి నుండి ప్రజలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో ఇంత భయానక ఘటన జరగడం, అది కూడా ఒక అమాయక మైనర్ బాలికపై జరగడం, సమాజంలో నేరాల తీవ్రతను మరోసారి చాటిచెప్పింది.పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన కుటుంబం తమ చిన్నారిని కాపాడుకోలేకపోయింది. తల్లిదండ్రులు రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఈ సమయంలో దుండగులు ఆ ఇంట్లోకి చొరబడి, ఆమెపై దారుణ హత్య చేశారు. మొదట్లో ఇది దోపిడీ కోణంలో జరిగిందా, లేక వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.

అనుమానితుల అరెస్ట్
తాజాగా పోలీసులు ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముఖ్యుడు సంజయ్ అనే యువకుడు. ఈ సంజయ్ అదే బిల్డింగ్‌లో అద్దెకు నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అలానే పోస్టుమార్టం రిపోర్టు (Postmortem report) లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక శరీరంపై సుమారు 20 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు నివేదికలో తెలిసింది. బాలిక శరీరం మీద మొత్తం 20 వరకు కత్తిగాట్లు ఉన్నాయని.. ఒక చిన్న పదునైన ఆయుధం వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక మెడ దగ్గర 14 వరకు అలానే పొట్ట దగ్గర 7 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని తెలిపారు. దుండుగుడు అత్యంత కిరాతకంగా.. చాలా పదునైన ఆయుధంతో బాలికను పొడిచాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 5 టీములు ఈ కేసు కోసం పని చేస్తున్నాయని.. ఇద్దరిని అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. హత్య జరిగిన ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: