ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అభ్యర్థులు ఎన్నో రాజకీయ ఎత్తుగడలు వేస్తుంటారు. కానీ కొందరు మాత్రం హద్దులు దాటి, భయబ్రాంతులు సృష్టించే క్షుద్రపూజలకూ పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓట్లే తుది నిర్ణయం తీసుకునే సాధనం అయినప్పటికీ, ఇలాంటి అంధ విశ్వాసాలకు ఆశ్రయించడంపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: UP Crime: రోడ్డు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య

ఖమ్మం తర్వాత మక్తల్‌లో కలకలం
ఇటీవల ఖమ్మం(Khammam) జిల్లాలో చోటుచేసుకున్న ఘటన మరచిపోకముందే, నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో మరో క్షుద్రపూజ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తుది విడత పంచాయతీ ఎన్నికలు(Panchayat elections) సమీపిస్తున్న వేళ, గెలుపు కోసం కొందరు అభ్యర్థులు అంధ విశ్వాసాలను నమ్ముకుంటూ గ్రామాల్లో టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారు.
ఇంటిముందు అర్థరాత్రి పూజలు
మక్తల్ మండలం కాచ్వార్ గ్రామంలో బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న వెంకటమ్మ ఇంటి ముందర అర్థరాత్రి వేళ క్షుద్రపూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. తెల్ల ఆవాలు, పసుపు తదితర వస్తువులను చల్లి ఏవో పూజలు చేసినట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఉదయాన్నే ఆ దృశ్యాలు చూసిన వెంకటమ్మ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది.
క్షుద్రపూజల వల్ల కీడు జరుగుతుందన్న భయంతో వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేపింది.
ప్రత్యర్థులపై ఆరోపణలు
ఈ క్షుద్రపూజల వెనుక కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థి బంధువుల హస్తం ఉందని వెంకటమ్మ కుటుంబం ఆరోపిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, కాంగ్రెస్ మద్దతుదారు రేణుక మామ రాములు ఈ పనికి పాల్పడ్డాడని కుటుంబం చెబుతోంది. పోలింగ్ స్టేషన్ సమీపంలో కూడా అతడు ఇలాంటి పూజలు చేసినట్టు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎన్నికల వేళ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఇదే తరహా ఘటన రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా గోళ్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యాలయం ముందు కత్తెర గుర్తుతో కూడిన స్లిప్ పెట్టి క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఈ దృశ్యం వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఓట్లకు మంత్రాలు పనికిరావు
సర్పంచ్ పదవుల కోసం ఇలాంటి అంధ విశ్వాసాలు, దుష్ట ఆలోచనలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘మంత్రాలకు చింతకాయలు రాలవు’ అన్న నానుడి గుర్తు చేస్తూ, ఓట్లను నిర్ణయించేది ప్రజలే తప్ప క్షుద్రపూజలు కాదని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: