Software engineer suicide : ఖైరతాబాద్‌లో చోటుచేసుకున్న విషాద ఘటన నగరాన్ని కలిచివేసింది. వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తరుణ్ (30) రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న తరుణ్ ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
2017లో ప్రసన్నతో వివాహమైన తరుణ్‌కు మూడేళ్ల కుమార్తె ఉంది. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటూ అత్తవారింటి సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపానికి చేరుకున్నాడు.
Read Also: Ghee Controversy : కల్తీ జరిగింది మీ హయాంలో కాదా ? – విడదల రజనీ

అక్కడ అతడు పట్టాలపై ఉన్నట్లు గమనించిన గేట్‌మన్ వెళ్లిపోవాలని హెచ్చరించాడు. అయితే కొద్దిసేపటి తర్వాత నాంపల్లి వైపు వెళ్తున్న రైలును గమనించిన తరుణ్ తీవ్ర నిర్ణయానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు అతడి ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
నాంపల్లి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి సరైన కౌన్సెలింగ్, కుటుంబ మద్దతు అవసరమని పోలీసులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: