కర్నూలు (Kurnool) జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని దుఃఖంలో ముంచేసింది.అయితే ఈ ఘటనకు సంబంధించిన విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.వందల మొబైల్ ఫోన్లు (Mobile phones) ఒక్కసారిగా పేలడం వల్లే మంటలు తీవ్రరూపం దాల్చి, భారీ ప్రాణనష్టం సంభవించిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, ప్రమాదానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Thamma Movie: థామా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్.. కారణం ఏంటంటే?
కావేరి ట్రావెల్స్ (Kaveri Travels) కు చెందిన బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఘర్షణ తలెత్తి నిప్పురవ్వలు చెలరేగాయి.

ఆ నిప్పురవ్వలు లీకైన పెట్రోల్‌కు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి.అయితే, తొలుత ఈ మంటలు బస్సు లగేజీ క్యాబిన్‌కు వ్యాపించాయి. ఆ క్యాబిన్‌లో 400కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్న పార్సిల్ ఉందని అధికారులు గుర్తించారు. మంటలు ఆ పార్సిల్‌కు అంటుకుని, ఫోన్లలోని బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి.
బస్సు ముందు భాగంలోని సీట్లు, బెర్తుల్లో
దీంతో క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి లగేజీ క్యాబిన్ పైనున్న ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి.ఈ ఘటనలో బస్సు ముందు భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలు (Forensic teams) సేకరించిన ఆధారాలతో పోలీసులు ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: