మహిళల పై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.ప్రస్తుతం మహిళలు ప్రశాంతంగా, జీవించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, కేరళ లోని త్రిశూర్ (Thrissur) లో గర్భిణీ ఫసీలా గృహ హింసను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త నౌఫాల్, అత్త రమ్ల అరెస్టు అయ్యారు. ఫసీలా తన తల్లికి పంపిన సందేశాలలో తన భర్త, అత్తల ద్వారా ఎదుర్కొంటున్న వేధింపుల గురించి వివరించింది. ఇదే విధంగా కొల్లంలో అతుల్య అనే మహిళ కట్నం కోసం వేధింపులకు గురై యుఏఈలో మృతి చెందింది.వాళ్లు నన్ను చంపేస్తారు.. అందుకే నేను చనిపోతున్నాను అంటూ ఓ గర్భిణి తన తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కేరళ (Kerala) లోని త్రిసూర్‌లో చోటు చేసుకుంది. ఫసీలా అనే మహిళ త్రిసూర్ జిల్లాలోని వెల్లంగులర్‌లోని తన భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జూలై 29న జరిగింది. ఇరింజలకుడ పోలీసులు ఆమె భర్త నౌఫాల్, అత్త రమ్లను అరెస్టు చేశారు.

నేను చనిపోతున్నానంటూ
ఇద్దరినీ బుధవారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మెట్టినింట్లో తాను నిత్యం నరకంఅనుభవిస్తున్నానని,ప్రతిరోజూ తనపై దాడి చేస్తున్నారని ఆమె తన తల్లికి మేసేజ్‌లు కూడా పంపింది.ఫసీలా తన తల్లికి పంపిన మేసేజ్‌లలో తాను రెండవసారి గర్భవతినని, తన భర్త తన కడుపులో చాలాసార్లు తన్నాడని చెప్పింది. వీళ్లు నన్ను చంపేసేలా ఉన్నారని, అందుకే నేను చనిపోతున్నానంటూ ఆ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఇతర సంబంధిత విభాగాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిస్సూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.
త్రిసూర్ ప్రత్యేకత?
త్రిసూర్ కేరళ సాంస్కృతిక రాజధానిగా, పూరమ్స్ భూమిగా ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా పురాతన దేవాలయాలు, చర్చిలు మరియు మసీదులకు ప్రసిద్ధి చెందింది.
కేరళ సాంస్కృతిక నగరం ఏది?
త్రిసూర్ నగరం వేడుకల నగరంగా పిలువబడుతుంది. చరిత్ర అంతటా దాని సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు మతపరమైన మొగ్గు కారణంగా కేరళ సాంస్కృతిక రాజధానిగా కూడా పిలువబడుతుంది. నగర కేంద్రంలో కేరళ సంగీత నాటక అకాడమీ, కేరళ లలితకళా అకాడమీ మరియు కేరళ సాహిత్య అకాడమీ ఉన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Read Also: AIADMK: ఎన్‌డీఏ నుండి వైదొలిగిన అన్నాడీఎంకే క్యాడర్ హక్కుల కమిటీ