కేరళ (Kerala) లో సాంకేతిక యుగంలోనూ ఇంకా మంత్ర తంత్రాలు, దెయ్యాలు, మూఢనమ్మకాలు నమ్ముతూ.. ఎవరు, ఎప్పుడు, ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. పిల్లలు పట్టట్లేదని, ఆరోగ్యం బాగాలేదని, ఆర్థిక నష్టాలు వస్తున్నాయంటూ.. స్వామీజీల వద్దకు వెళ్లి వారు ఏం చెబితే అది చేసేస్తున్నారు. విద్యా ప్రగతి ఉన్న కేరళలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం కలవరపెడుతోంది.
Read Also: Kurnool Tragedy: ఛీ..ఛీ..మీరసలు మనుషులేనా .. ఆభరణాల కోసం వెతుకులాట
కేరళలోని కొల్లాంకు చెందిన సాజీర్ అనే వ్యక్తి తన భార్య రజీలా గఫూర్ (Razila Ghafoor) చాలా రోజులుగా అనారోగ్యంతో ఉండటంతో.. ఆమెకు సైతాన్ పట్టిందని బలంగా నమ్మాడు. ఈ మూఢ విశ్వాసంతో ఆయన కొద్ది కాలంగా స్థానిక ఉన్న ముస్లిం మంత్రగాడు (ఉస్తాద్) వద్దకు వెళ్లడం ప్రారంభించాడు.
ఆ మంత్రగాడి మాటలు నమ్మిన సాజీర్.. ఆమెకు తాయత్తు కట్టాలని, అలాగే ఆమె కురులు విప్పి విబూది ధరించాలని ప్రయత్నించాడు.మంత్రగాడు చెప్పిన విధంగా రజీలాకు తాయత్తు కట్టడానికి సాజీర్ ప్రయత్నించగా.. రజీలా అందుకు నిరాకరించింది. భర్త మాట వినకపోవడంతో సాజీర్ (Sajeer) తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

క్షణికావేశంలో అతను నేరుగా వంటింట్లోకి వెళ్లి
క్షణికావేశంలో అతను నేరుగా వంటింట్లోకి వెళ్లి.. పొయ్యి మీద ఉడుకుతున్న వేడి వేడి చేపల కూరను తీసుకొచ్చి రజీలా ముఖంపై చల్లాడు.ఈ అమానుష దాడి వల్ల రజీలా ముఖంపై తీవ్రమైన గాయాలు అయ్యాయి. అయితే ఆమె గట్టిగా కేకలు వేస్తూ ఏడ్వగా.. స్థానికులంతా అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు ఆమె ముఖం 11 శాతం కాలిందని తెలిపారు. అయితే సాజీర్ ఇలా దాడి చేయడం ఇదే మొదటి సారి కాదు. తన భార్యకు దెయ్యం పట్టిందనే అనుమానంతో ఆయన గతంలోనూ పలుమార్లు ఆమెపై గృహ హింసకు పాల్పడ్డాడు.ఈ విషయంపై గతంలోనే బాధితురాలు రజీలా పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. భర్త తీరు మారలేదు.
తరచుగా మంత్రగాళ్ల వద్దకు వెళ్తూ.. వారు చెప్పిందే వింటూ అందుకు సహకరించకపోతే భార్యపై దాడి చేసేవాడు. అయితే తాజాగా జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు సెక్షన్ 118(1) కింద సాజీర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సాజీర్‌ను అదుపులోకి అన్ని రకాలుగా విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: