మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం
సహకరించిన తల్లి, ప్రియుడికి 180 యేళ్లు చొప్పున కఠిన జైలు
రూ.11.75 లక్షలు జరిమానా
విధించిన కేరళ పోక్సో కోర్టు
కేరళ (Kerala) లోని కోజికోడ్లో జరిగిన దారుణ ఉదంతంపై కేరళ పోక్సోకోర్టు (Kerala POCSO Court) తీవ్రస్థాయిలో స్పందించింది. 12 ఏళ్ల మైనర్ బాలికపై పదేపదే అత్యాచారంచేసి హింసించినందుకుగాను మహిళకు, ఆమె బాగస్వామికి 180 ఏళ్లుచొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. పోక్సో కోర్టు న్యాయమూర్తి అష్రఫ్ ఎఎం బుధవారం తన తీర్పును వెలువరించారు. పోక్సో చట్టంలోని అనేక సెక్షన్లకింద వీరిపై కేసు నమోదుచేసారు.
Read Also: TN Crime: మహిళల వాష్ రూముల్లో రహస్య కెమెరాలు.. పోలీసులే అవాక్కైన ఘటన
ప్రతి సెక్షన్ పరిధిలో 40 ఏళ్లుచొప్పున కఠిన కారాగారశిక్ష ఉంటుందని, అలాగే 11.75 లక్షల రూపాయలు జరిమానా కూడా విదించారు. ఈ మొత్తాన్ని బాలికకు చెల్లించాలని ఆదేశించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 20 నెలలపాటు జైలుశిక్ష అనుభవిం చాల్సి ఉంటుందని వెల్లడించారు. పోక్సో కేసు (POCSO case) లో ఒకమహిళకు ఇంత భారీ ఎత్తునజైలుశిక్ష జరిమానా విధించడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుందని స్పెషల్పబ్లిసి క్యూటర్ సోమశేఖరన్ అన్నారు.
తన భర్త కుమార్తెతో తిరువనంతపురం (Thiruvananthapuram) లో జీవిస్తూనే ఈ నిందితురాలు మరొకరితో లేచిపోయిందని, వెళుతూ తన కుమార్తెను కూడా తీసుకువెళ్లినట్లు పోలీసులు ఛార్జిషీటులో వెల్లడించారు. పాలక్కడ్, మాలాప్పురం ప్రాంతాల్లో అద్దెఇళ్లలో నివసిం చినట్లు తేలింది. 2019 డిసెంబరునుంచి 2021 అక్టోబరు, మద్యకాలంలో వీరంతా అద్దెఇళ్లలో నివసిస్తూ తరచూ మకాం మార్చేవారని ప్రాసిక్యూషన్ అభియోగంమోసింది.

బాలిక తల్లి కూడా సహకరించి
ఈ కాలంలోనే మహిళ ప్రియుడు పదేపదే 12 ఏళ్లమైనర్ బాలికపై అత్యాచారంచేసాడని, అందుకు బాలిక తల్లి కూడా సహకరించి బాలికను బెదిరించి లైంగిక దాడికి మద్దతిచ్చిందని ప్రాసిక్యూషన్ అభియోగాలు నమోదుచేసింది. వ్యతిరేకిస్తే బాలిక మెదడులో చిప్ ఒకటి పెట్టామని, ఈ సంఘటన ఎవరికి చెప్పినా మాకు తెలిసిపోతుందని బెదిరించేందని ఆ బాలిక వాంగ్మూలం కూడా ఇచ్చింది.
అంతేకాకుండా అత్యాచారానికి ముందు బాలికచేత బలవంతంగా మద్యం తాగించే వారని కూడా విచారణలో రుజువయింది. కేసును విచారించిన పోక్సోకోర్టు జరిమానా బాలికకు చెల్లించాలని, జిల్లా న్యాయసేవల అథారిటీ కూడా ఆమెకు అదనపు సాయం అందించాలని, బాదితురాలి సహాయ పథకం కింద మంజూరుచేయాలని ఆదేశాలిచ్చింది.
ఈకేసులో పోక్సో చట్టం లోని సెక్షన్లు, జువనైల్ జస్టిస్ చట్టం, ఐపిసి కిందవిభిన్న అభియో గాలు నమోదుచేసి విచారణ చేసారు. ప్రియుడితో లేచిపోయిన ఈ మహిళ ఆతడితో కలిసి మైనర్ బాలికసమక్షంలోనే లైంగిక కార్యకలాపాలు చేసేవారని విచారణలో తేలింది. కోర్టు కు జరిమానా చెల్లిస్తే బాలికకు అందచేయాలని కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. శిక్ష అనుభవించేందుకుగాను ఇద్దరు దోషులను తవనూర్ జైలుకు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: