Karimnagar honour killing : కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో చోటుచేసుకున్న పరువు హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసు వివరాలను మాధవి హుజూరాబాద్ ఏసీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. బాలిక ఇటీవల మృతి చెందగా, ఆమె కడుపునొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Water Board: హైదరాబాద్‌లో నీటి సరఫరాకు 36 గంటల అంతరాయం
పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదని, పరువు హత్య అని తేలింది. బాధితురాలు అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ యువకుడికి ఇప్పటికే వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పలుమార్లు ఆమెను హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ పరువు పోతుందనే భయంతో, కూతురు (Karimnagar honour killing) ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు ఘోర నిర్ణయం తీసుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. గత నెల 14న ఇంట్లో గొడవ జరిగిన అనంతరం, ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య చేసిన తరువాత, బాలిక కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తల్లిదండ్రులే తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం తల్లిదండ్రులే నేరస్తులని నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: