Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సివిల్స్ పరీక్షల (Civil Services Examination) కు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న ఓ మహిళా అభ్యర్థి, తాను ఐఏఎస్ అయ్యాననే భ్రమలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన ఆమె, తానే కొత్త కలెక్టర్ అని ప్రకటించి కార్యాలయంలో హడావిడి చేసింది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డికి చెందిన ఆ మహిళ చాలా కాలంగా సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతోంది. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. చివరకు తాను ఉద్యోగంలో ఎంపికయ్యాననే భ్రమలో పడిపోయి, నేరుగా కలెక్టర్ కార్యాలయానికి చేరి తానే కలెక్టర్‌గా నియమితులయ్యానని ప్రకటించింది.
Read also: Chevella Accident: ముగ్గురు కూతుళ్ల పరిహారం చెక్కు.. ఆ తండ్రికి ఉప్పొంగిన దుఃఖం

Kamareddy: నేనే కలెక్టర్ ని.. ఇక్కడే నా పోస్టింగ్ చివరకి ఏమైంది?
పరీక్షల ఒత్తిడితో
Kamareddy: కార్యాలయంలోని అధికారులను తన “చాంబర్” ఎక్కడ ఉందని అడిగుతూ గందరగోళం సృష్టించడంతో సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. తర్వాత సదరు మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడినుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు ఆమెను తూప్రాన్ వద్ద గుర్తించి విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఆ యువతి సివిల్స్ పరీక్షల ఒత్తిడితో మానసిక అస్థిరతకు గురై, కుటుంబాన్ని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడిందని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: